Site icon NTV Telugu

Jr.NTR: బాబోయ్.. తారక్ చిన్న కొడుకు ‘భార్గవ్ రామ్’ క్రేజ్ మాములుగా లేదుగా

Untitled Design 2024 08 11t083703.181

Untitled Design 2024 08 11t083703.181

టాలీవుడ్ టాప్ స్టార్ లలో నందమూరి తారక రామారావు (Jr.NTR ) ముందు వరసలో వుంటారు.RRR వంటి సూపర్ హిట్స్ తో తారక్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా ఎక్కడికో వెళ్లింది. ప్రస్తుతం దేవర, వార్ -2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. తారక్ కు 2011లో లక్ష్మి ప్రణతితో వివాహం అయింది. వీరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్దోడు అభయ్ రామ్, రెండోవాడు భార్గవ రామ్.

Also Read : Tollywood: మురారిని వెనక్కి నెట్టిన చిన్న సినిమా.. 3వ స్థానంలో మురారి..

కాగా వీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచారు. ఇటీవల తారక్ సినీ కెరిర్ లో 31వ సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన పూజ కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరయ్యారు తారక్. పూజ సందర్భంగా తారక్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. భార్గవ్ చిన్నప్పటి తారక్ ని పోలిఉండడంతో ఇద్దరి ఫోటోలను జత చేసి ఖుషి అవుతున్నారు తారక్ ఫ్యాన్స్. వాటితో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ సినిమాలోని జైల్ సీన్ లో చినబాబు ఎట్టున్నాడన్న అని చలపతినిరావు ఆడినప్పుడు అయన చిన్న అని పిలిచినప్పుడు తారక్ వచ్చే సీన్ లో భార్గవ్ రామ్ క్లిప్పింగ్స్ జతి చేసి వీడియోలు చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో తారక్ వారసుడిగా బుడ్డోడు టాలీవుడ్ ను ఏలబోతున్నాడు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Exit mobile version