NTV Telugu Site icon

Jr NTR Sons: వెంకటేష్ తో జూ.ఎన్టీఆర్ కొడుకుల సందడి

Ntr Sons With Venkatesh

Ntr Sons With Venkatesh

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. తర్వాత ఆయ్ అనే సినిమా చేసి ఆ సినిమాతో కూడా ఓ మాదిరి హిట్టు అందుకున్నాడు. ఇక ఈరోజు ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు శివాని కాగా ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Aishwarya Rai : పెళ్లికి ముందే మగబిడ్డకు జన్మనిచ్చిన ఐశ్వర్యరాయ్ .. షాకింగ్ విషయం వెలుగులోకి?

ఇక ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు టాలీవుడ్ లోని అనేక మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు తరలివచ్చారు. అయితే ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ ఇద్దరూ విక్టరీ వెంకటేష్ తో కలిసి సరదాగా గడుపుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వెంకటేష్ ఎన్టీఆర్ కొడుకులు ఇద్దరితో సరదాగా ఆడుకుంటూ కనిపిస్తున్నారు.

Show comments