Jr NTR: ఈవెంట్ రద్దు.. ఆవేదనతో వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR Releases a Video to all his fans about the Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అభిమానులను, ఈవెంట్ కి హాజరైన వారందరికీ ఉద్దేశిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆవేదన కూడిన ముఖ కవళికలతో కనిపిస్తున్న ఎన్టీఆర్ అందరికీ నమస్కారం అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ రోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం, క్యాన్సిల్ అవడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు అవకాశం, దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని దేవర మూవీ గురించి దేవర మూవీ కోసం మేం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీసన్స్ వల్ల ఈవెంట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్లీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను, మీ కన్నా ఎక్కువ బాధ నేను పడుతున్నాను.
Chiranjeevi: ఊరికే అవ్వరు ‘మెగాస్టార్’..డ్యాన్స్ కోసం రాత్రంతా!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
కానీ ఇది ఇలా జరగడం వెనుక దేవర నిర్మాతలలో లేక ఈవెంట్ ఆర్గనైజర్స్ ను నిందించడం కూడా కరెక్ట్ కాదు, అని నా ఫీలింగ్. ముందుగా మీరు కురిపించే ఈ ప్రేమకు ఆజన్మాంతం రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీకు మనందరం కలవబోతున్నాం. దేవర చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీ అందరూ చూసి నేను ఎప్పుడు మీకు చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడం నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీకు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివ గారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం. నాకు కూడా చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వాదాలు మాకు అందిస్తారని, మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొక మాట. మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని, ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అంటూ జై ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?