నెపోటిజం గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎస్క్వైర్ ఇండియా అనే ఒక మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అదే మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుతూ తండ్రిగా తన అభిప్రాయాలను వెల్లడించాడు. “నేను నా కొడుకులను మీరు కూడా యాక్టర్ కచ్చితంగా అవ్వాల్సిందే అని చెప్పను. నేను అలాంటి విషయాలను నమ్మను. నేను వాళ్లకి ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలనుకుంటాను కానీ ఒక అడ్డుగోడలా ఉండాలని అనుకోను. వాళ్లకి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలను నా కళ్ళతో చూపించాలని అనుకుంటాను. వాళ్లకి బయటికి వెళ్లి నేర్చుకునే అవకాశాన్ని కల్పించాలని అనుకుంటాను,” అని చెప్పుకొచ్చాడు.
Also Read:Jr NTR : అదసలు మ్యాటరే కాదు.. లోపల ఏముందనేది ముఖ్యం!
అంతేకాదు, తండ్రిగా తాను ప్రమోషన్ పొందాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నాడు. “కేవలం నేను ఎలా బతుకుతాను అనే విషయం మీద మాత్రమే కాదు, నా పని విషయంలో కూడా అది ప్రభావితం చేసింది. నేను చేసే పాత్రలో ఈజీగా ఉండకూడదని ఫిక్స్ అయ్యాను. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన అప్పటినుంచి మొదలైంది,” అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
