NTV Telugu Site icon

Jr NTR : ఇక గ్యాప్ లేదమ్మా.. విధ్వంసమే!

Jrntr Neel

Jrntr Neel

Jr NTR Movies to Relese back to back in Coming years: 2001లో వచ్చిన ‘నిన్ను చూడాలని’ సినిమా నుంచి.. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చాడు ఎన్టీఆర్. అయితే.. ఇన్నేళ్ల కెరీర్లో కంత్రీ, అదుర్స్ సినిమాల మధ్యలో 2009లో ఒకసారి గ్యాప్ ఇచ్చారు. అక్కడి నుంచి 2018 లో వచ్చిన అరవింద సమేత తర్వాత వరకు అసలు గ్యాప్ ఇవ్వలేదు టైగర్. కానీ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం మూడు నాలుగేళ్ల గ్యాప్ ఇచ్చాడు. ఇక 2022లో ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. 2023లో మళ్లీ ఒకసారి గ్యాప్ ఇచ్చేశాడు. అయితే.. 2024 నుంచి మాత్రం అసలు గ్యాప్ అనేది లేకుండా వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. తాజాగా ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి.. ఫ్యాన్స్‌కు మాసివ్ ట్రీట్ ఇచ్చాడు.

Double iSmart: ఇక వెనక్కి తగ్గేది లేదమ్మా.. డబుల్ డోస్ గ్యారెంటీ!

ఎన్టీఆర్, నీల్ వర్కింగ్ టైటిల్‌తో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా.. 2026 జనవరి 9న రిలీజ్ కానున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ ఏడాదిలో సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. ఆ తర్వాత 2025 ఆగష్టులో వార్ 2 విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. ఆ పైన ఎలాగు ప్రశాంత్ నీల్ సినిమా ఉండనే ఉంది. అయితే.. ఈ మధ్యలో దేవర 2 కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి.. ఇక నుంచి ఏడాదికొక సినిమాతో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. దేవర.. తారక్ కెరీర్లో అత్యధిక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా.. వార్ 2 మరింత గ్రాండ్‌గా రాబోతోంది. ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో టైగర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర ఓ విధ్వంసం చూడబోతున్నామని చెప్పాలి.

Show comments