జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎంతో ప్రేమ చూపించారు. సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. అయితే దేవర రెండవ భాగం మీద అందరికీ ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమాకి సంబంధించిన కథ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే కొరటాల శివను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన చెప్పిన కథ విని ఇక జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోదామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
NTR Neel: ‘డ్రాగన్’ పని మొదలెడుతున్నారు !
నిజానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఆ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. రేపు గురువారం నుంచి సినిమా కోసం సిద్ధం చేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ లెక్కను చూసుకుంటే ఒకపక్క ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో పాటు దేవర 2 సినిమా కూడా త్వరలోనే పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవర కథ తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కూడా భావిస్తున్నారు. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.