Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..

Jr Ntr, Dragon Movie, Prasanth Neel

Jr Ntr, Dragon Movie, Prasanth Neel

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘డ్రాగన్’ (Dragon). ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేయగా.. తాజాగా ఈ సినిమాలో తారక్ పోషించబోయే పాత్రకు సంబంధించిన షాకింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్‌ను ప్రశాంత్ నీల్ స్వయంగా రివీల్ చేశారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించిన కథాంశం ప్రకారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అత్యంత భయంకరంగా ఉండబోతోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947వ సంవత్సరంలో, కేవలం 10 ఏళ్ల వయసు ఉన్న ఒక చిన్న పిల్లాడిని అఫ్గానిస్తాన్‌కు ఒక అస్సాసిన్ (హంతకుడు) గా పంపుతారు. అక్కడ పెరిగి పెద్దయిన ఆ అబ్బాయి.. ‘అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ’ (Afghan Trading Company) కి అత్యంత నమ్మకమైన, క్రూరమైన ‘చీఫ్ ఎన్‌ఫోర్సర్‌’గా మారిపోతాడు. అతడే మన లూగర్(ఎన్టీఆర్). అంతే కాదు తాను ఇప్పటివరకు రాసుకున్న క్యారెక్టర్స్‌లో ఇదే మోస్ట్ కాంప్లెక్స్ (అర్థం చేసుకోవడం కష్టమైన) క్యారెక్టర్ అని చెప్పారు నీల్.

‘మేము ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఒక కంప్లీట్ వెరీ వెరీ నెగిటివ్ క్యారెక్టర్‌గా ప్రెసెంట్ చేయబోతున్నాము. నెట్‌ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ ‘నార్కోస్’ (Narcos) లోని డ్రగ్ లార్డ్ ‘ప్యాబ్లో ఎస్కోబార్’ (Pablo Escobar) పాత్రను చూసి ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారో.. ఈ లూగర్ పాత్ర కూడా అలాగే ఉంటుంది. స్క్రీన్‌పై తారక్ చేసే పనులు చాలా నెగిటివ్‌గా ఉన్నప్పటికీ.. అతడు ఎందుకు అలా మారాడో, ఆ నెగిటివిటీ వెనుక ఉన్న కారణం ఏంటో ఆడియన్స్‌కు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతడి వైపు ఉన్న న్యాయాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు’ అని ప్రశాంత్ నీల్ వెరైటీకి వివరించారు. ఈ స్టేట్‌మెంట్‌తో ‘డ్రాగన్’ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ లాంటి ఒక పవర్‌ఫుల్ పర్ఫార్మర్ ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ వరల్డ్‌లో ప్యాబ్లో ఎస్కోబార్ తరహా గ్రే-షేడ్ పాత్రలో నటిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఈ లూగర్ అప్‌డేట్ మరిన్ని అంచనాలను పెంచేసింది.