NTV Telugu Site icon

Jr.NTR : దేవర 3 వారాలు కంప్లిట్.. లెక్కలేనన్ని రికార్డులు..

Devara

Devara

యంగ్ టైగర్ ఎన్టీయార్ కొరటాల శివ కాంబో మరోసారి తమది సక్సెస్ ఫుల్ కాంబో అని నిరూపించారు. గతంలో వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కాగా తాజాగా వచ్చిన దేవర సెన్సేషనల్ హిట్ సాధించింది. తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెప్టెంబరు 27 న రిలీజ్ అయిన ఈ సినిమా 30 రోజుల థియేట్రికల్ రన్ కంప్లిట్ చేసుకుని అర్ధశతా దినోత్సవం వైపు పరుగులు తీస్తుంది.
Also Read : SilambarasanTR: ఏమాయ చేసావే రీ – రీలీజ్ వరల్డ్ రికార్డ్…
తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని సెంటర్స్ లో దేవర ఇప్పటికి స్టడీగా కలెక్షన్స్ సాధిస్తోంది. మిక్స్డ్ టాక్ తో మొదలై రెండవ రోజునుండి హిట్ టాక్ తో దూసుకెళ్తూ రూ. 500 కోట్లు గ్రాస్ రాబట్టిన సినిమాగ దేవర నిలిచింది. రిలీజ్ నాటి నుండి కంటిన్యూగా 19 రోజులు పాటు కోటి రూపాయల షేర్ రాబట్టిన ఆల్ టైమ్ సినిమాల్లో నాలుగవ సినిమా గా దేవర రికార్డుక్రియేట్ చేసింది. 2024 భారతీయ సినిమాలు వరల్డ్ వైడ్ టాప్ గ్రాస్ ఓపెనింగ్స్ రూ.172 కోట్లుతో రెండవ సినిమా దేవర నిలిచింది. ఇక నార్త్ అమెరికాలో రిలీజ్ ముందే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లో 2 మిలియన్ దాటిన ఓన్లీ తెలుగు సినిమాగా దేవర చరిత్ర సృష్టించాడు. కన్నడ నాట రూ. 70 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది దేవర. తెలుగు రాష్ట్రాల్లో ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా  2024 లో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలలో ప్రతీ ఒక్కరు లాభాలు చూసిన స్టార్ హీరో సినిమా దేవర మాత్రమే.