ఆంధ్రుల ఆరాధ్య దైవంగా, అన్నగారిగా భావించే నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నేడు. దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 18 జనవరి 1996లో మరణించారు. ఆ మహానాయకుడి 29వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈరోజు తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న తాత సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
Ramnagar Bunny: ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసిన ‘రామ్ నగర్ బన్నీ’ స్ట్రీమింగ్ ఎందులో అంటే..
ఇతర కుటుంబ సభ్యులు, కొందరు అభిమానులు కూడా ఎన్టీఆర్ ఘాట్ చేరుకోని నివాళులు అర్పించారు. తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలలోని తెలుగు దేశం యువత కూడా ఎన్టీఆర్ విగ్రాహాలకి పూల మాలలు వేసి తమ అభిమాన నాయకుడిని స్మరించుకుంటున్నారు. తొలుత సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల మది దోచుకున్న ఆయన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎవరు ఊహించని స్థాయిలో పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి ఒక సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఇక ఆయన మరణించి నేటికి 29 సంవత్సరాలు పూర్తయ్యాయి.