NTV Telugu Site icon

పచ్చిస్‌ : ‘జూదం’పై ఆకట్టుకుంటున్న పెప్పీ సాంగ్

Joodham Playing card joker Lyrical Video launched by Adivi Sesh

ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ రామ్జ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “పచ్చిస్‌”తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. రామ్జ్ సరసన శ్వేత వర్మ హీరోయిన్ గా నటించింది. శ్రీ కృష్ణ, రామ సాయి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవాసా చిత్రమ్, రాస్తా ఫిల్మ్స్ జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్ “జూదం” అనే లిరికల్ వీడియో సాంగ్ ను హీరో ఆదివి శేష్ రిలీజ్ చేశారు. మనిషి జీవితంలో జూదం సృష్టించే నాశనం గురించి చెప్పే సాంగ్. జూదం వల్ల డబ్బును కోల్పోవడం మాత్రమే కాదు, ఆత్మగౌరవం, సంబంధాలు, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్మారన్ సాయి ఈ పెప్పీ సాంగ్ ను ఆలపించారు. మీరు కూడా ‘జూదం’ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.