JoJo : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్

Jo Jo Movie

Jo Jo Movie

ఈ మధ్య ప్రమోషనల్ కంటెంట్ తో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమాల్లో జోజో ఒకటి. దేవా కట్టా సమర్పిస్తున్న రూర‌ల్ కామెడీ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా, మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అని చెబుతూనే, మేకర్స్ ‘కాషన్ టూ’ పేరుతో కొత్త గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. కిరణ్ జయకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృష్ణ కమల్, మహేష్ శ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జొన్నగిరిలో జరిగే వజ్రాల వేట చుట్టూ తిరిగే ఈ కథలో, తాజాగా విడుదల చేసిన glimpse పలు అంశాలతో పాటు కామెడీతోనూ ఆకట్టుకుంటోంది. హీరో, హీరోయిన్‌ని ప్రేమిస్తానంటాడు.. దానికి బ‌దులుగా ‘‘పడుచు పిల్ల కానొస్తే… ఓ నాలుగు దినాలు వెనక పడి… పని కానిచ్చుకొని… పారిపోయే టైపా? ఇష్టపడిన పిల్లని దాని బాధ్యతలతో సహా పెళ్ళి చేసుకొని దాన్ని జీవితాంతం మోసెంత గుండకాయ ఉన్న మొగోడి టైపా అని’’ ఆ పిల్ల ప్ర‌శ్నిస్తాది .. దానికి హీరో బ‌దులిస్తూ..‘‘సత్య ప్రమాణికంగా చెబుతున్నా ఒకతూరి మాట ఇచ్చినానంటే మడమ తిప్పని వంశం మాది… బాలయ్య బాబు టైపు’’ అని హీరో గడుసుగా సమాధానం ఇస్తాడు.

హీరోయిన్ మ‌రి హీరోని ప్రేమిస్తాదా! అని తెలియాలంటే మాత్రం ‘జో జో’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. కృష్ణ క‌మ‌ల్ , మ‌హి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూర‌ల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్ జ‌య్ కుమార్ ద‌ర్శ‌కుడిగా రూపొందుతోంది. విజ‌యం బ్యాన‌ర్‌పై విజ‌య్ కృష్ణ లింగ‌మ‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన కాష‌న్ 1కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్.. గురువారం జో జో సినిమా నుంచి కాష‌న్ 2 వీడియో విడుద‌ల చేశారు. ఈ సినిమాను విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. ఆయన గతంలో దర్శకుడిగా పలు సినిమాలు చేశారు. కాష‌న్ వ‌న్ వీడియోతో సినిమాపై మేక‌ర్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. సినిమాకు సంబంధించి మరికొన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామని మేక‌ర్స్ తెలిపారు.