స్టార్ హీరోతో సినిమా ఉంటే.. మామాలు విషయం కాదు. ఆషామాషీ వ్యవహారం అంతకన్నా కాదు. కత్తిమీద సాములాంటిదే. ఇదే సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. అతడి ముందు బిగ్ టార్గెట్టే ఉంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పుటి నుండి మరో లెక్క. జీతూ మాధవన్ ప్రజెంట్ మాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్. జస్ట్ టూ మూవీస్‌తో కేరళ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించాడు. రోమాంచమ్, ఆవేశం చిత్రాలే అందుకు ఎగ్జాంపుల్స్. రెండు కోట్లతో తీసిన హారర్ కామెడీ రోమాంచమ్ రూ. 70 కోట్లను కుమ్మరిస్తే, ఆ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆవేశం రూ. 150 కోట్లను వసూలు చేసి ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసింగ్ మాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
Also Read : Janhvi Kapoor : జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఈ రాత్రికి జాగారమే
రోమాంచమ్, ఆవేశం సక్సెస్ అతడికి బిగ్ స్టార్‌తో వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్‌తో తన థర్డ్ మూవీని సెట్ చేసుకున్నాడు. రీసెంట్లీ దీనిపై మోహన్ లాల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ చేశారు కూడా. నెక్ట్స్ ఇయర్ మిడిల్‌లో ఈ ప్రాజెక్టు ఉండబోతుందని ఓపెన్ అయ్యారు మలయాళ స్టార్ హీరో. ఇప్పటి వరకు సౌబిన్, ఫహాద్ ఫజిల్ లాంటి టైర్ 2 యాక్టర్లను డీల్ చేసిన జీతూ ఇప్పుడు మాలీవుడ్ స్టార్‌తో వర్క్ చేయబోతున్నాడు. పాస్ట్ టూ మూవీస్‌తో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిన డైరెక్టర్‌కు స్టార్ హీరోతో సినిమా అంటే బిగ్ టార్గెట్ ఉన్నట్లే లెక్క. ఈ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండాలి తన నెక్ట్స్ ప్రాజెక్ట్. అందులోనూ ఈమూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాల్సిన సిచ్చుయేషన్. మరీ ఈ టార్గెట్స్ అన్ని జీతూ మాధవన్ రీచ్ అవుతాడో లేదో చూడాలి.