Site icon NTV Telugu

Jigris OTT: అమెజాన్ ప్రైమ్‌లో ‘జిగ్రీస్’ సునామీ.. ఇంట్లో అన్-లిమిటెడ్ నవ్వుల జాతరే!

Jigris Ott

Jigris Ott

టాలీవుడ్ యువ న‌టులు కృష్ణ బురుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా నటించిన చిత్రం ‘జిగ్రీస్‌’. ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్‌ హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా.. మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. 2025 నవంబర్‌ 14న విడుదలైన జిగ్రీస్‌.. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. రోడ్ ట్రిప్-ఫ్రెండ్‌ షిప్‌ జోన‌ర్‌లో వచ్చిన ఈ సినిమాకు యూత్ ఫిదా అయిపొయింది. సినిమా చూస్తున్నంత సేపు తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని ప్రేక్షకులు చెప్పడంతో డెబ్యూ డైరెక్టర్‌ హరీశ్ రెడ్డి సక్సెస్ అయ్యారు.

Also Read: Auqib Nabi: వర్త్ వర్మ వర్త్.. 8వ స్థానంలో వచ్చి నబీ మెరుపు సెంచరీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాన్స్ హ్యాపీ!

థియేటర్లలో నవ్వులు పూయించిన యూత్‌ ఫుల్ కామెడీ జిగ్రీస్‌.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చేసింది. జనవరి 6 నుంచి సన్ నెక్ట్స్‌, ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సినిమా మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో పెద్ద సంఖ్యలో వీక్షిస్తున్నారు. దాంతో జిగ్రీస్‌ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో క్లిప్స్, డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఇది కదా ఫ్రెండ్షిప్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా మొత్తం ఎక్కడా కూడా వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. కాబట్టి ఇంట్లోనే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లలో సినిమా చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

Exit mobile version