తెలుగు సినీ చరిత్రలో ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో భారీ సంచలనం సృష్టించడం అంటే అరుదైన విషయమే. అలాంటి ఘనతను ‘కలర్ ఫోటో’ తర్వాత మళ్లీ ‘జిగ్రిస్’ సినిమా సాధించింది. థియేటర్లలో సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు సందడి చేస్తున్నప్పటికీ, ఓటీటీలో మాత్రం ‘జిగ్రిస్’ తన హవాను కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం రెండు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో (సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్) నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ట్రెండ్ అవుతూ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
జిగ్రిస్ సినిమా కేవలం ఒకే భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కంటెంట్‌కి భాష అడ్డుకాదని మరోసారి జిగ్రిస్ నిరూపించింది. ఈ సినిమాతో హీరో కృష్ణ బురుగుల ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆయన పోషించిన కార్తీక్ పాత్రకు వస్తున్న స్పందన చూస్తే.. అభిమానుల ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ‘కార్తీక్ క్యారెక్టర్‌లో జీవించేశావు అన్న’ అంటూ ప్రేక్షకులు ప్రశంసల మెసేజ్‌లతో ఆయనను ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా కృష్ణ బురుగుల కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సహజమైన నటనతో నవ్వులు పూయించడమే కాకుండా.. పాత్రకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసలు అందుకుంటున్నారు. యూత్ అయితే ఆయనను ఇప్పటికే ఓటీటీ స్టార్ అంటూ కిరీటం కట్టేస్తోంది.
Also Read: Nari Nari Naduma Murari: సంక్రాంతి 2026కి బ్లాక్‌బస్టర్ ఎండ్.. శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయి!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘జిగ్రిస్’ క్లిప్స్, కృష్ణ నటనపై ప్రశంసలే కనిపిస్తున్నాయి. డల్లాస్ నుంచి గల్లీ వరకు అందరూ ఇప్పుడు కృష్ణ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న జిగ్రిస్.. తెలుగు ఓటీటీ కంటెంట్ శక్తిని మరోసారి నిరూపించింది. 2025 నవంబర్ 14న విడుదలైన జిగ్రీస్ సినిమా థియేటర్లలో మంచి విజయం అందుకుంది. రోడ్ ట్రిప్-ఫ్రెండ్ షిప్ జోనర్‌లో వచ్చిన ఈచిత్రంకు యూత్ ఫిదా అయిపొయింది. జిగ్రిస్ సినిమాకి హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా.. మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. కృష్ణ బురుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా కీలక పాత్రల్లో నటించారు.
