NTV Telugu Site icon

Zeebra : మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా ఆ హీరో సినిమా ట్రైలర్ లాంఛ్

Zebra

Zebra

ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించాడు యంగ్ హీరో సత్యదేవ్.  ఇటీవల కాస్త గ్యాప్ తర్వాత సత్య దేవ్ మరియు కన్నడ స్టార్ డాలీ ధనంజయతో  కలిసి నటించిన మల్టీ-స్టారర్ ‘జీబ్రా’ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్‌లైన్ . ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం మరియు దినేష్ సుందరం భారీ స్థాయిలో నిర్మించారు.

Also Read  : Dulquer Salmaan : రూ. 100 కోట్ల దిశగా లక్కీ భాస్కర్..

అక్టోబర్ 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన  విడుదల వాయిదా పడింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాను నవంబరు 22న విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు మేకర్స్. వరుస ఫ్లోప్స్ కు బ్రేక్ వేసి ఈ దఫా ఎలాగైనా సక్సెస్ ఇస్తుందని ఎంతో ఆశగా, నమ్మకంగా ఉన్నాడు హీరో సత్యదేవ్. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను మొదలుపెట్టాడు సత్యదేవ్. అందులో భాగంగా ఈ సినిమా గురించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నాడు సత్యదేవ్. జీబ్రా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గా నిర్వహించబోతున్నారని తెలిపారు. ఈ నెల 12న జరగనున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు. చిరు చేతుల మీదుగా జీబ్రా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా గల్లా అశోక్ నటిస్తున్న దేవకీ నందన వాసుదేవ తో పోటీ పడనుంది.

Show comments