జీ తెలుగు సమర్పిస్తున్న సెలబ్రిటీ టాక్ షో *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి*. మొట్టమొదటిసారి నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నేతృత్వంలో రూపొందుతోంది. వారం వారం సినీ ప్రముఖులు గెస్ట్‌లుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలవనుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి గెస్ట్‌గా *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి*, ఆగస్టు 17 ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రారంభం కానుంది.
Also Read : Bigg Boss 9 : బిగ్ బాస్-9 కోసం నాగార్జున భారీ రెమ్యునరేషన్..
ఘనంగా ప్రారంభం కానున్న *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి* లాంచ్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి అతిథిగా రానున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో నాగార్జున తన కెరీర్, వ్యక్తిగత జీవితం, కుటుంబ సంగతులతో పాటు సూపర్ హిట్ సినిమాల నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌తో తన అనుబంధం వరకు మరెన్నో విశేషాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. అంతేకాదు, ఈ ఎపిసోడ్‌లో అక్కినేని కుటుంబ ప్రముఖ వ్యక్తులు ముఖ్య అతిథులుగా హాజరై, నాగార్జున గురించి మరిన్ని సంగతులను చెప్పడమే కాక, భావోద్వేగంతో కూడిన మరపురాని క్షణాలను ఆస్వాదించనున్నారు.