Site icon NTV Telugu

Jayam: జీ తెలుగులో అందమైన ప్రేమకథ జయం!

Zee Jayam

Zee Jayam

జీ తెలుగు సరికొత్త సీరియల్ ‘జయం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్(శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి(వర్షిణి)జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా, పేదరికం,తల్లి అనారోగ్యం,తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా? గతాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలరా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే జయం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే.

Also Read:Bihar: మరో ఇల్లాలు ఘాతుకం.. ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య

ఈ సీరియల్ విశేషాలు పంచుకోడానికి హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో జయం సీరియల్ ప్రధాన పాత్రదారులైన శ్రీరామ్ వెంకట్, వర్షిణి పాల్గొని కథలోని పాత్రలు, ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. నటుడు శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ, “జయం ఒక ప్రత్యేకమైన కథ, ఇది ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలకు భిన్నమైనది. బాక్సింగ్ కోచ్‌గా రుద్ర పాత్రలో నటించడం నాకు సవాలుగా, అదే సమయంలో ఉత్సాహంగా అనిపించింది. మా నటీనటులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రేక్షకులు ఈ ధారావాహికను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం,” అన్నారు.

Exit mobile version