Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, మానసిక వేదనకు సంబంధించిన వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. దశాబ్ద కాలంగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో.. తన భార్య ఆర్తి (Aarti) నుండి ఎదుర్కొంటున్న మానసిక క్షోభను, ఆర్థిక ఇబ్బందులను మీడియా ముందు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకోవడం యావత్ సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.
తన పిల్లలను కలవనివ్వకుండా బాడీగార్డ్స్‌ను పెట్టడం దగ్గరి నుండి, తన సొంత కష్టార్జితాన్ని వాడుకోనివ్వకుండా చేసిన ఆంక్షల వరకు ఆయన చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా కన్నీళ్లు రావడం ఖాయం. ఈ క్రమంలోనే విడాకుల సెటిల్మెంట్ కోసం ఆర్తి డిమాండ్ చేసిన భారీ భరణం (Alimony) వివరాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.బకోర్టు పరిధిలో ఉన్న ఈ విడాకుల కేసులో.. భర్త జయం రవి నుండి విడిపోవడానికి ఆర్తి పెట్టిన కండిషన్స్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ప్రకారం జయం రవి తనకు విడాకులు ఇవ్వాలంటే.. జీవితాంతం తన మెయింటెనెన్స్ కోసం నెలకు రూ. 40 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆర్తి కోర్టులో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నెలకు రూ. 40 లక్షలు అంటే సంవత్సరానికి ఏకంగా రూ. 4.8 కోట్ల రూపాయలు కేవలం భరణం రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఈ డిమాండ్‌పై ట్రేడ్ వర్గాలు మరియు నెటిజన్లు జయం రవికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే, జయం రవి సాధారణంగా ఒక సినిమా చేయడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకుంటారు. ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్ రూ. 5 నుండి 6 కోట్ల లోపే ఉంటుంది. ఒకవేళ ఏడాది మొత్తం సినిమాలు చేయకపోతే ఆయన పరిస్థితి ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి కోర్టు ఈ కేసులో జయం రవికి ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలని కోలీవుడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!