Site icon NTV Telugu

Jayam Ravi : బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు .. స్టార్ హీరో వైఫ్ పోస్ట్ వైరల్

Jayam Ravi

Jayam Ravi

తమిళ హీరో జయం రవి ఫ్యామిలీ గురించి కొంత కాలంగా వరుస వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అతను తన భార్య ఆర్తితో 18 ఏళ్ల వైవాహిక బంధానికి తెర దించుతున్నట్లు గత ఏడాది ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకటి పేరు తెచ్చుకున్న జంట ఇలా విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఐతే జయం రవి ఈ విడాకుల గురించి ప్రకటించిన ఆర్తి.. తన భర్త నుంచి విడిపోవడం తనకు ఇష్టం లేదని.. తమ బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడం ఇంకా ఆశ్చర్యం కలిగించింది. కానీ వీరి బంధం నిలవలేదు. విడాకుల కేసు కోర్టుకు వెళ్లింది. ఇప్పుడు వీరు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా రవి గురించి ఆర్తి పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్‌గా మిరింది..

Also Read: Mrunal Thakur : ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేను..

కెవిషా అనే సింగర్‌తో జయం రవి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకారు షిక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కోలీవుడ్లో జరిగిన ఒక పెళ్లికి కెవిషాతో కలిసి హాజరవడమే కాక.. ఫొటోలకు పోజులిచ్చారు రవి. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ తర్వాతి రోజే ఆర్తి తీవ్ర ఆవేదనతో మీడియాకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.. ‘ తమ ఇద్దరు పిల్లల్ని అస్సలు పట్టించుకోవడం లేదు.. వారి పోషణకు డబ్బులు కూడా ఇవ్వట్లేదు.. తమ తండ్రి తమను కలవకపోవడం, పట్టించుకోకపోవడం, మరో మహిళతో కలిసి తిరగడం చూసి పిల్లలు ఎంత వేదన అనుభవిస్తుంటారో అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో ఏడుస్తూ కూర్చున్న.. పిల్లల కోసం బలంగా నిలబడతాను’ అని రవి పేరు పెట్టకుండా విమర్శలు గుప్పించింది. రవితో తనకు ఇంకా అధికారికంగా విడాకులు రాలేదని.. కాబట్టి ఇంకా తన పేరు వెనుక అతని పేరు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేయడం గమనార్హం. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version