Site icon NTV Telugu

సీఎం రిలీఫ్ ఫండ్ కు జయంరవి ఫ్యామిలీ విరాళం

Jayam Ravi Family contributed Rs 10 lakhs to TN CM Relief Fund

కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాలు పంచుకుంటున్నారు.

అందులో భాగంగానే తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా అ విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, తల అజిత్, తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్, తమిళ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీతో పాటు తదితరులు కరోనా రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందించారు.

తాజాగా మరో తమిళ స్టార్ హీరో జయం రవి ఫ్యామిలీ కరోనా రిలీఫ్ ఫండ్ కి తమ విరాళాలు అందించారు. నేడు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు జయం మోహనరాజు, హీరో జయం రవి తమిళనాడు ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత రూ.10 లక్షల విరాళం విరాళం అందజేశారు.

Exit mobile version