Jayam Ravi: ఆ సింగర్ తో అఫైర్.. పెదవి విప్పిన జయం రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jayam Ravi Clarity on rumours of affair with a singer: తమిళ చిత్రసీమలో టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న జయం రవి తన కాలేజీ స్నేహితురాలు, నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి పెళ్లయి 15 ఏళ్లు అయింది, వీరికి ఆరవ్ -అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్నో చిత్రాల్లో నటించేందుకు జయం రవికి సపోర్ట్ చేసింది ఆయన భార్య. జయం రవిని స్వేచ్ఛగా నటించడానికి అనుమతించడమే కాక అతని కుటుంబం, కొడుకులు, అత్తమామలను కూడా బాగా చూసుకున్నారు. జయం రవి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది జరిగిన ఓ కార్యక్రమంలో జయం రవి తల్లిదండ్రులు ఈ విషయాన్ని వెల్లడించారు.
అదేవిధంగా, ఆర్తి కూడా తన భర్త జయం రవి తనను ఎంతో ప్రేమతో చూసుకుంటారని -గర్భధారణ సమయంలో తనను బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చింది. ఈ విషయాలు అన్నీ చెప్పుకున్న ఏడాది తర్వాత తన భార్య ఆర్తితో విడాకుల కోసం జయం రవి దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్తి, జయం రవి మధ్య గొడవకు ప్రముఖ గాయని కెనీషా కారణమని ప్రకారం జరుగుతోంది. మొదట్లో గోవాలోని పబ్ లలో పాడిన కెనీషా ఆ తర్వాత ఆల్బమ్ సాంగ్స్ లో పాడడం ప్రారంభించింది. నటుడు జీవా నిర్మించిన ఆల్బమ్ సాంగ్‌లో కూడా పాడగా అప్పుడే జయం రవి, కెనీషా ఒకరికొకరు పరిచయం అయ్యారని, ఆ తర్వాత అదే జయం రవిలో మార్పుకు కారణమైందని అంటున్నారు.
Also Read
అయితే బ్రదర్ మ్యూజిక్ లాంచ్‌కి హాజరైన జయం రవి ఇలాంటి అనేక వివాదాలను వివరించారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా జయం రవి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న నా పేరును చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని అంత తేలిగ్గా జరగనివ్వను.. ఆర్తీతో మాట్లాడిన తర్వాతే.. నా లాయర్ ద్వారా విడాకుల నోటీసు కూడా పంపబడింది, ఆర్తి ఈ సంఘటన గురించి ఇప్పటికే మాట్లాడుకున్నా, ఆర్తి తనకేమీ తెలియదని చెబుతోంది. జూన్‌లో నా కొడుకు ఆరావ్ పుట్టినరోజున నేను చెన్నైలో ఉన్నాను. ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న ఫోటోలు కూడా విడుదలయ్యాయి.
అయితే అదే రోజుల్లో నన్ను వేరే ఊరిలో చూశానని చెప్పడం పూర్తిగా అవాస్తవమని వివరణ ఇచ్చారు. నా పెద్ద కొడుకుకి అర్థమయ్యేలా విడాకుల విషయం చెప్పాను. అయాన్ చిన్న కుర్రాడు కాబట్టి నేను అతనితో దీని గురించి మాట్లాడలేను. అలాగే మా పెద్ద కొడుకు ఆరవ్ కూడా ఇద్దరం కలిసి జీవించాలని కోరాడు. అయితే అందుకు కుదరడం లేదని కూడా స్పష్టం చేశానని అయన అన్నారు. గాయని కెనీషాతో నాకు ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆమె గాయని మాత్రమే కాదు సైకాలజిస్ట్ కూడా. కెనిషా -నేను భవిష్యత్తులో కలిసి ఒక వైద్యం కేంద్రాన్ని తెరవాలని నిర్ణయించుకున్నాము. దీని ద్వారా ఎంతో మందికి సాయం చేయాలని కోరుకుంటున్నామని జయం రవి తెలిపారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!