ఇళయదళపతి విజయ్ తమిళనాడులో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా విజయ్ గోట్ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో ఉంది. త్వరలో పూర్తి స్థాయి రాకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు విజయ్. ఈ కారణంగా చిత్ర పరిశ్రమ తప్పుకోనున్నాడు విజయ్. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. కానీ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తమిళ సినీపరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. కానీ తన తండ్రిలా హీరోగా కాదు మాత్రం కాదు.
Also Raed : Priyadarshi : ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ ముగిసింది..
అవును జాసన్ సంజయ్ తన తాత అడుగుజాడల్లో నడుస్తూ దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. గతంలో ఇందుకు సంబంధించి 2023లో ప్రకటన కూడా చేసారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో జాసన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇన్నాళ్లు ఈ సినిమాలో నటించే హీరోఎవరు అనే తకరారు నడిచింది. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు జాసన్ దర్శకత్వంలో నటిచబోయే హీరో మాన టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ అని తెలుస్తోంది.సందీప్ కిషన్ తమిళ పరిశ్రమకు కొత్తేమి కాదు. గతంలో అనేక సూపర్ హిట్ సినిమాలలో ఈ యంగ్ హీరో నటించాడు. ఇటీవల ధనుష్ దర్శకత్వంలో వచ్చిన రాయన్ లోను సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని కోలీవుడ్ టాక్. జాసన్ దర్శకత్వం వహించే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ AR. రెహమాన్ కొడుకు సంగీత దర్శకుడుగా పరిచయం కాబోతున్నట్టు కూడా న్యూస్ వినిపిస్తోంది. అన్నట్టు తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ కనకరాజ్ మొదటి సినిమా నగరం లోను సందీప్ కిషన్ హీరోగా నటించాడు