NTV Telugu Site icon

Jani Master: అండగా నిలబడతామన్నారు.. మెగా కుటుంబంపై జానీ మాస్టర్ ట్వీట్

Jani Master Ram Charan Upasana

Jani Master Ram Charan Upasana

Jani Master Thanks Ram Charan and Upasana : తన పుట్టినరోజు తరువాతి రోజే జానీ మాస్టర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ నిన్న పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ మేరకు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా వెల్లువలా కురిశాయి. అయితే ఆయన తాజాగా ట్వీట్ చేస్తూ సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడని అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినప్పుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డాను. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న, ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది.

Kalki 2898 AD : కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్ యూనియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎలో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు. కొద్దిరోజుల క్రితం జానీ మాస్టర్ జనసేనలో చేరి ఆ పార్టీ కోసం ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ కూడా చేస్తారని ప్రచారం జరిగినా అది కేవలం ప్రచారానికే పరిమితం అయింది.

Show comments