Site icon NTV Telugu

Jani Master: మతం మారాలని దాడి.. పార్శిల్ వార్నింగ్.. వెలుగులోకి సంచలనాలు!!!

Janimaster

Janimaster

Jani Master Parcel Warning to Girl filed Rape Complaint: తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో పాపులర్ అయి ఈ మధ్యనే నేషనల్ అవార్డు కూడా సాధించిన జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవుట్‌ డోర్ షూటింగ్స్ సమయంలో, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆమె పేర్కొనగా నార్సింగి పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు పొందుపరిచారు పోలీసులు. ఢీ 12 చేస్తున్నప్పుడు భాదితురాలకు జానీ మాస్టర్ @ షేక్ జానీ బాషాతో పరిచయం ఏర్పడిందనీ చెబుతున్నారు. మతం మారాలని ,పెళ్లి చేసుకోవాలని బాధితురాలని వేధించడంతోపాటు ఆమె పై బెదిరింపులకు దిగాడని ఆమె ఆరోపిస్తోంది.

Adithi-Siddharth Marriage: అదితి-సిద్ధార్థ్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌!

వీటికి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశాడని ఆరోపిస్తోంది. ఆగస్టు 28న తనకు ఒక వింత పార్శిల్ వచ్చిందని, పేరు లేకుండా వచ్చిన దాన్ని తన ఇంటి తలుపుకు వేలాడదీసారని ఆమె పేర్కొంది దాని లోపల ‘ Congratulations for son be care full అని రాసి ఉందని ఆమె చెబుతోంది. 2017లో ఢీ డాన్స్ షోలో జానీ మాస్టర్ కు ఆమె పరిచయమై తర్వాత జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయింది. ఆ తర్వాత 2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది. సదరు యువతి. ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళిన యువతిపై ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ రేప్ అటెంప్ట్ చేసి ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించాడని ఆరోపిస్తోంది.

Exit mobile version