Site icon NTV Telugu

Jani Master: ఆ రోజు నిజస్వరూపం బయటపడుతుంది.. కేసు పెట్టిన యువతికి జానీ మాస్టర్ కౌంటర్

Jani Master Remand

Jani Master Remand

గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కేసు వివాదం మళ్లీ రాజుకుంది. ఈ వివాదంపై యాంకర్ ఝాన్సీ ఒక కీలక అప్డేట్ ఇవ్వగా దానినే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన యువతి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక వాటికి కౌంటర్ ఇస్తూ జానీ మాస్టర్ లేటెస్ట్‌గా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు.

Ananya Panday: హీరోని వదిలేసి అతనితో హీరోయిన్ డేటింగ్?

మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది!!’ అని ఆయన రాసుకొచ్చారు. అంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఝాన్సీ ఒక పోస్ట్ పెట్టారు. “లైంగిక ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ గెలిచింది. పని ప్రదేశంలో లైంగిక ఆరోపణల కేసు విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. జానీ మధ్యంతర పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైనది, ఈ అంశం మీద పోరాటం చేసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కి ధన్యవాదాలు” అని ఝాన్సీ పోస్ట్‌ పెట్టారు. దాన్ని జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన యువతి కూడా పోస్ట్ చేశారు.

Exit mobile version