NTV Telugu Site icon

Jani Mastar case : కొన్ని ఛానెల్స్ అత్యుత్సాహంతో బన్నీపేరు పెట్టాయి: పుష్ప నిర్మాత

Untitled Design (6)

Untitled Design (6)

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని,  మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన ఆ యువతి మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పుష్ప -2 లోని ఓ సాంగ్ కు అడిషనల్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే.

Also Read : Mathuvadalara2 : ఓవర్సీస్ లో డాలర్స్ వర్షం కురిపించిన MV2

ఈ వ్యవహారమై మత్తువదలరా -2 సక్సెస్ మీట్ లో  మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాతుతూ ”  ఆ యువతీ లాంగ్ బ్యాక్ పుష్ప -2 స్టార్ట్ చేసినప్పుడే ఓక సాంగ్ కోసం వర్క్ చేసింది. గణేష్ ఆచార్య మాస్టర్ సూచించిన స్టెప్స్ టీమ్ కు వివరించేందుకు ఆయన అడిషనల్ కొరియోగ్రాఫర్ గా విజయ్, ఈ యువతీ వర్క్ చేస్తుంటారు. అలాగే పుష్ప -2 లోని అన్ని సాంగ్స్ కు వర్క్ చేస్తున్నారు, ఇంకా 2 పాటలు పెండింగ్ లో ఉన్నాయి. అక్టోబరు లో ఆ సాంగ్స్ ఇఓ షూట్ చేస్తాం, వాటికి కూడా ఆ అమ్మాయి ఉంటుంది. అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుంది దానికి జానీ మాస్టర్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్. కానీ ఈలోగా ఇదంతా జరిగింది. ఆ అమ్మాయి సెట్స్ లో ఉన్నపుడు బన్నీతో హాయ్ సార్ అంతవరకే ఉంటారు. కానీ కొందరు కొత్త వచ్చిన యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళ సెన్సేషన్ కోసం బన్నీ జానీ మాస్టర్ ను తప్పించి ఆ యువతికి  అండగా ఉన్నారు అని ఫేక్ న్యూస్ లు రాసారు. మా సినిమా బ్రహ్మాడంగా వస్తుంది,  జానీ మాస్టర్ కేసు వ్యవహారం అది  వారి వ్యక్తిగతం”  అని అన్నారు.