Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం 

Janga

Janga

తెలుగు తెరపై కొన్ని సినిమాలు ప్రకటనతోనే ఆసక్తి రేపుతాయి, మరికొన్ని తమ ఫస్ట్ గ్లింప్స్‌తోనే ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి సెన్సేషనే క్రియేట్ చేస్తోంది యంగ్ హీరో త్రిగుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘జంగా’. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఊహకందని రా అండ్ రస్టిక్ లుక్‌తో త్రిగుణ్, పవర్‌ఫుల్ యాక్షన్ అవతారంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించిన తీరు చూస్తుంటే.. వెండితెరపై ఏదో పెద్ద సంచలనమే జరగబోతోందని అర్థమవుతోంది.  ఇప్పటివరకు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో కనిపించిన త్రిగుణ్, ‘జంగా’ కోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. ఈ గ్లింప్స్‌లో ఆయన లుక్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వెనుక ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకుని, నోట్లో ఏకంగా మందు బాటిల్ పెట్టుకుని త్రిగుణ్ సైకిల్ తొక్కుతున్న విజువల్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను ఆకాశానికి చేర్చింది. అంతేకాదు, స్మశానంలో కాలుతున్న శవాన్ని ఆయన తీక్షణంగా గమనిస్తున్న సన్నివేశం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
దీనికి తోడు.. “కొన్ని లక్షల ఏండ్లు పట్టింది పశువు మనిషి అవ్వడానికి.. మళ్లీ పశువు అవుతానంటే నేను ఒప్పుకోను.. మనిషి పశువు అయితే మరణం వధం అయితాది” అంటూ త్రిగుణ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ సినిమాలోని ఇంటెన్సిటీని చాటిచెబుతోంది. ఈ గ్లింప్స్‌లో మరో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ వరలక్ష్మీ శరత్ కుమార్. చూడటానికి ఎంతో సంప్రదాయబద్ధమైన లుక్‌లో కనిపిస్తూనే, చేతిలో తుపాకీ పట్టి రౌడీలను కాల్చి పారేస్తున్న ఆమె యాక్షన్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఒకవైపు శివతత్వం, ఆధ్యాత్మికత ఉట్టిపడే టైటిల్ (జంగా), మరోవైపు పుట్టుక-చావుల మధ్య ఉండే సంక్లిష్టత, రక్తపాతం.. ఈ రెండింటినీ దర్శకుడు కెవిన్ గడ్డం (శ్రీహరి) అద్భుతంగా బ్యాలెన్స్ చేసినట్లు కనిపిస్తోంది. గ్లింప్స్ చూసిన రామ్ గోపాల్ వర్మ సైతం ఫిదా అయిపోయారు. ‘జంగా’ గ్లింప్స్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, త్రిగుణ్‌కు, చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఆయన పోస్ట్ చేయడం సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది. వెంకట్ సి. దిలీప్ అందించిన డార్క్ అండ్ రస్టిక్ విజువల్స్, కృష్ణ సౌరభ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు ప్రాణం పోశాయి. ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీమతి వనిత కిలారి సమర్పణలో రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేహా పఠాన్, మధునందన్, గగన్ విహారి, శ్రావణ్, చందు గౌడ, రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.