Site icon NTV Telugu

Nagendra Babu: మా అన్నయ్య తప్ప.. అందరి పెరఫార్మెన్స్ సూపర్

Nagababu

Nagababu

భీమవరం సభపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సినీనటుడు కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా నివాళి, ఆ సభలో మా అన్నయ్య చివరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు అంటూ నాగబాబు తాజాగా ట్వీటర్ లో వేదికగా వ్యాఖ్యలు చేసారు.

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సోమవారం స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహావిష్కరణ జరిగిన విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమంలో.. ప్రధాని మోడీ, సీఎం జగన్, మంత్రి రోజా తదితరులు పాల్గొన్నారు. దీనిపై నాగబాబు తాజాగా ట్విటర్ లో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మోడీతో రోజా సెల్ఫీ దిగి తన సోషల్ మీడియాలో పోస్టే చేసారు. అయితే మోగాస్టార్ చిరంజీవి కూడా మోడీతో కలిసిన పోటోలు కూడా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే నాగబాబు చేసిన విషయం పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి పవన్ గైహాజరు కావడంపై నాగబాబు స్పందించారా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,,<br>ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు 🌺🌷🌷🌷🌺🌺</p>&mdash; Naga Babu Konidela (@NagaBabuOffl) <a href=”https://twitter.com/NagaBabuOffl/status/1544672431020724224?ref_src=twsrc%5Etfw”>July 6, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Exit mobile version