KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ తాజా చిత్రం ‘జన నాయకుడు’ విడుదల ఘడియలు దగ్గరపడ్డాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాబోయే జులై 23న ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 స్క్రీన్లలో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో నిర్మాత వెంకట్ కె. నారాయణ సినిమా విశేషాలను పంచుకున్నారు. విజయ్ రాజకీయ రంగప్రవేశం తర్వాత వస్తున్న చివరి చిత్రం కావడంతో ఈ సినిమా అనేక అడ్డంకులను ఎదుర్కొంది. జనవరిలో విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు జులై 23కి వచ్చింది, మొత్తంగా చూస్తే రిలీజ్, పైరసీ, కోర్టు వ్యవహారాలు… ఇలా ఇన్ని సమస్యలు ఎదురవుతాయని మేము అసలు ఊహించలేదు. దేవుడు యుద్ధం తర్వాతే కిరీటం ఇస్తాడనే నమ్మకంతో ముందడుగు వేశాం. ముఖ్యంగా విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత థియేటర్లలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంది. కాకపొతే ఇందులో మంచిని కూడా చూడాలంటే విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా వస్తోంది, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ గారి సినిమా థియేటర్లలో విడుదల కావడం ప్రేక్షకులకు, అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి.” అని నిర్మాత పేర్కొన్నారు.
ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ‘భగవంత్ కేసరి’ ఛాయలు ఉన్నాయన్న ప్రచారంపై స్పందిస్తూ: “ఆ సినిమాలో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ నేపథ్యం ఉండి, రెండు సీన్లు మాకు ఎంతగానో నచ్చాయి. అందులోని రెండు సన్నివేశాలను మాత్రమే ఇన్స్పిరేషన్గా తీసుకుని, మిగతా కథ మొత్తం కొత్త ప్రపంచంలో సాగేలా రూపొందించాం, ఇందులో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్, సమాజంలో మార్పు తీసుకురావాలనే సందేశం ఉంది. ఆ భావనను మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నాము తప్ప, ‘జన నాయకుడు’ కథా ప్రపంచం, కాన్ఫ్లిక్ట్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. దర్శకుడు అనిల్ రావిపూడి గారితో కూడా మాట్లాడాకే ఈ పాయింట్‌పై నిజాయితీగా వర్క్ చేశాం.” అని క్లారిటీ ఇచ్చారు. విజయ్ క్రమశిక్షణ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం అద్భుతమని, ఆయన మేనేజర్ ద్వారా ప్రారంభమైన ఈ ప్రయాణం కేవీఎన్ బ్యానర్‌కు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నిర్మాత హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయ్ గారి దృష్టి అంతా ప్రజాసేవపైనే ఉన్నందున మళ్లీ సినిమాలు చేసే అవకాశం లేకపోవచ్చని, అందుకే ఈ చిత్రం ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణానికి అత్యుత్తమ ట్రిబ్యూట్‌గా అభిమానులకు ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు. ప్రస్తుతం విజయ్ దృష్టంతా ప్రజా సేవపైనే ఉంది, ఈ పరిస్థితుల్లో ఆయన మళ్లీ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు, విజయ్ సినీ ప్రయాణానికి ఓ ట్రిబ్యూట్‌లా ఉండేలా ప్లాన్ చేశాం, అని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని ప్రొడ్యూసర్ వెంకట్ తెలిపారు.
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!