Site icon NTV Telugu

Jailer : జపాన్‌లో రిలీజ్ కాబోతున్న జైలర్

Jailer

Jailer

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ కంటే ముందే  గ్లోబల్ స్టార్  ఇమేజ్ తెచ్చుకున్నసౌత్ ఇండియన్ హీరో సూపర్ స్టార్  రజనీకాంత్.  ఆయన సినిమాలకు కేవలం తమిళనాడులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అనేక దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయస్సు వచ్చినా ఇంకా అదే హుషారుతో సినిమాలు చేస్తున్నారంటే అది తలైవాకి మాత్రమే సాధ్యం. ఈ వయస్సులో కూడా అలుపెరగని బాటసారిగా బ్యాట్ బ్యాక్ చిత్రాలు చేస్తున్నారు.

Also Read : Jr. NTR : యంగ్ టైగర్ కు తలనొప్పిగా మారిన వార్ 2

వరుస సినిమాలతో రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తున్నారు రజనీ. ప్రెజెంట్ కూలీ, జైలర్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు రజనీ జపాన్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. జపాన్ లో ఆయనకు ఎప్పటి నుండో క్రేజ్ ఉంది. అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. రజనీ ముత్తు  జపాన్ లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. అందుకే ఇప్పుడు జైలర్ ని కూడా ఆ భాషలోకి డబ్ చేయబోతున్నారు మేకర్స్. పెట్టా, దర్బార్, అన్నాతే చిత్రాలతో పడిపోతున్న రజనీ గ్రాఫ్ నిలబెట్టిన మూవీ జైలర్. 2023లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రూ. 650 కోట్లను కొల్లగొట్టింది. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీష్రాఫ్ లాంటి దిగ్గజ స్టార్లు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇప్పుడు ఈ  సినిమా ఫిబ్రవరి 21 జపాన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు వెళుతుంది. త్వరలో జైలర్ సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి  జైలర్ 2 ను కూడా జపాన్ లో రిలీజ్ చేయాలన్న యోచనలో ఉన్నారట మేకర్స్.

Exit mobile version