NTV Telugu Site icon

RGV : డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష

Rgv (2)

Rgv (2)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై అంథేరి మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. వివరాలోకెళితే 2018లో ముంబై లో దర్శకుడు ఆర్జీవీపై  చెక్‌బౌన్స్‌ కేసు నమోదైంది. శ్రీ అనే కంపెనీకి చెందిన మహేష్ చంద్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెక్ బౌన్స్ విషయమై ఫిర్యాదు చేసాడు. అయితే గత ఏడేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసులో కోర్టుకు పలుమార్లు రామ్ గోపాల్ వర్మకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ   ఒక్కసారి కూడా ఆర్జీవీ కోర్టుకు హాజరు కాలేదు.

Also Read : Wamiqa : ప్లాప్ హీరోయిన్ చేతిలో ఆరు సినిమాలు

దీంతో ఆగ్రహించిన  నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 కింద కేసు నమోదు చేసి  డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారునికి RGV 3 నెలల్లో రూ. 3.72లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ డబ్బు ఇవ్వక పోతే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించింది. ఇటీవల సత్య రీరిలీజ్ సందర్భంగా ఆ సినిమా చేసి తాను మారిపోయాయని ఇక భాద్యత గా సినిమాలు చేస్తానని చెప్పిన వర్మ ‘సిండికేట్’ అనే సినిమాను కూడా ప్రకటించాడు. ఇప్పుడు ముంబై అంథేరి మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆర్జీవీకి బిగ్ షాక్ తగిలింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్జీవీని అరెస్ట్ చేస్తారెమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.