Site icon NTV Telugu

Jai Hanuman: ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్..

Jai Hanuman

Jai Hanuman

వివిధ జానర్లతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఓ పవిత్రమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. హనుమంతుని మహిమను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి మరో కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ – ‘జై హనుమాన్’. హనుమంతుని జీవితం, ధైర్యం, భక్తి అన్నీ కలిసిన ఓ సాంకేతిక కాంభినేషన్‌గా తెరకెక్కించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయింది, వీఎఫ్‌ఎక్స్ ఆధారిత ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. ఇక హీరో రిషబ్ షెట్టి ప్రజంట్ ‘కాంతార 2’ కంప్లీట్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఆయన వస్తే వెంటనే షూటింగ్ ప్రారంభించడమే.

Also Read : Athadu : మహేష్ అడ్డాలో ‘అతడు’కు మెగా వెల్కమ్!

ఇది సాధారణ పాథలాజికల్ మూవీ కాదని, ఇందులో అత్యాధునిక విజువల్ టెక్నాలజీ ఉపయోగించనున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ గతంలో ‘హను మాన్’ లో చూపించిన విజువల్స్‌ను మించిపోయేలా ఉంటుందట. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే నేషనల్ .. ఇంటర్నేషనల్ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఈ సినిమా తాలూకు లక్ష్యాన్ని ప్రశాంత్ వర్మ చాలా స్పష్టంగా చెప్పారు..‘హనుమంతుల వారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ఈ చిత్ర ఉద్దేశం. ఇది కేవలం భక్తి చిత్రం కాదు. ఇది ఒక కల్చరల్ మానిఫెస్టో’ అని ఆయన చెప్పారు. అందుకే ఈ ప్రాజెక్టు కోసం ప్రశాంత్ గత కొన్నేళ్లుగా రీసెర్చ్ చేశారు. పురాణాల నుంచి ఆధునిక టెక్నాలజీ వరకు అన్ని స్థాయిల పరంగా ఈ సినిమా అభివృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version