టాలీవుడ్ నటుడు జగపతిబాబు హీరోగా ఎన్నో సినిమాలు చేసి, విలన్‌గా టర్న్ అయ్యాడు. విలన్‌గా కూడా బోర్ కొట్టిన తర్వాత, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన జీ స్టూడియోస్ కోసం “జయంబు నిశ్చయమ్మురా” అనే ఒక టాక్ షో చేస్తున్నాడు. మొదటి ఎపిసోడ్ నాగార్జునతో చేయగా, అది సూపర్ హిట్ అయింది. తర్వాత శ్రీలీలతో ఒక ఎపిసోడ్ చేశాడు. అది కూడా బాగా వైరల్ అయింది. ఇప్పుడు నానితో చేసిన తాజా ఎపిసోడ్ జీ ఫైవ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ షోలో నాని సినిమా ఒకటి రిజెక్ట్ చేసి, తర్వాత బాధపడ్డానని జగపతిబాబు చెప్పుకొచ్చాడు.
Also Read :Hombale Films : అరుదైన ఘనత సాధించిన హోంబాలే ఫిలింస్
నాని జెర్సీ సినిమా కోసం జగపతిబాబుని అప్రోచ్ అయ్యారట. ఈ సినిమాలో సత్యరాజ్ పోషించిన పాత్ర కోసం ముందు జగపతిబాబుని అడిగితే, కథ విన్న తర్వాత అది ఫ్లాప్ అవుతుందని భావించి రిజెక్ట్ చేశాడట. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత, నాని నటించిన ఏ సినిమా నుంచి ఆఫర్ వచ్చినా తాను కాదనకూడదని ఫిక్స్ అయ్యాడట. అంతేకాదు, నాని హీరోగా నటించే సినిమా అయినా, నాని నిర్మాతగా వ్యవహరించే సినిమా అయినా, వాటి నుంచి ఆఫర్ వస్తే కచ్చితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా జగపతిబాబు చెప్పుకొచ్చారు. మొత్తం మీద, జగపతిబాబు జడ్జిమెంట్ జెర్సీ విషయంలో ఫెయిల్ అయిందన్నమాట.
