Site icon NTV Telugu

‘హీరో’ డబ్బింగ్ పూర్తిచేసిన జగ్గూభాయ్!

Jagapathi Babu completed dubbing for Hero

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ప్రిన్స్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘హీరో’. అమరరాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అశోక్ తల్లి పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ‘హీరో’ మూవీకి తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఇప్పటికే సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న జగపతిబాబు డబ్బింగ్ సైతం కంప్లీట్ చేశారు.

Read Also : హైదరాబాద్ కు తిరిగొచ్చేసిన ప్రభాస్… స్పెషల్ లుక్ లో !!

ఆ విషయాన్ని జగ్గూబాయ్ డబ్బింగ్ థియేటర్ లో ఉన్న ఫోటోను జత చేస్తూ, తెలియచేసింది చిత్ర బృందం. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘హీరో’ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రెస్పాన్స్ వస్తోంది. అశోక్ గల్లా తన తొలి చిత్రంలోనే కృష్ణ నటించిన ‘యమలీల’ మూవీలోని ‘జుంబారే జూజుంబరే’ సాంగ్ ను రీమిక్స్ చేసి, తనదైన స్టైల్ లో నర్తించడం విశేషం.

Exit mobile version