హైదరాబాద్ కు తిరిగొచ్చేసిన ప్రభాస్… స్పెషల్ లుక్ లో !!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జూలై 21న తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. ఇటలీ ట్రిప్ ముగించుకుని తాజాగా హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో రౌండ్లు వేస్తున్నాయి. ఆయన విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటికి వెళ్లేటప్పుడు ప్రభాస్ తన జుట్టును బీనితో కప్పినట్టు ఆ వీడియోలో కన్పిస్తోంది. ప్రభాస్ బ్లాక్ టీ షర్ట్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి, తలకు బ్లాక్ బీని, సన్ గ్లాసెస్, స్నీకర్లను ధరించాడు. తెల్లటి మాస్క్ కూడా ధరించాడు. కాగా ప్రభాస్ ఇటలీ యాత్రకు గల కారణం “రాధేశ్యామ్” షూటింగ్ అని అంటున్నారు.

Read Also : ఆహాలో రాబోతున్న కన్నడ ‘హీరో’!

ప్రభాస్ చివరిసారిగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన “సాహో”లో కన్పించాడు. ఈ చిత్రం 2019లో విడుదలైంది. ఇప్పుడు ఆయన నటిస్తున్న చిత్రాలు కొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా, మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” విడుదల కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మొదట జూలై 30న విడుదల కానుందని ప్రకటించారు. కానీ కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. “రాధే శ్యామ్”తో పాటు నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం, దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’, దర్శకుడు ఓం రౌత్ తో ‘ఆదిపురుష్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-