Site icon NTV Telugu

ఇదెక్కడి రచ్చ రా బాబూ… మరీ ఇంత హాట్ గానా..!

Jacqueline Fernandez in bold photoshoot for Dabboo Ratnani Calendar 2021

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సినిమాల్లో నటన కన్నా ఎక్కువగా గ్లామర్ షోతోనే క్రేజ్ సంపాదించుకుంది. అయితే రానురానూ ఈ బ్యూటీ గ్లామర్ అనే పదానికి హద్దులు చెరిపేస్తున్నట్టు కన్పిస్తోంది. ఈ గ్లామర్ క్వీన్ బిగ్ స్క్రీన్ పై తన అందాలను, ఒంపుసొంపులను చూపడానికి ఏమాత్రం వెనుకాడదు. అయితే తాజాగా జాక్వెలిన్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని 2021 క్యాలెండరుపై మెరిసింది. ఈ స్టార్ ఫోటోగ్రాఫర్ క్లిక్ మన్పించిన పిక్ యమా హాట్ గా ఉంది.

Read Also : “ఆర్‌సి 15” కోసం శంకర్ కు భారీ పారితోషికం

బట్టలు లేకుండా కేవలం బెడ్ షీట్ తోనే ఒంటికి కవర్ చేసుకున్న జాక్వెలిన్ పిక్ చూసి యూత్ నోరెళ్లబెడుతున్నారు. ఆమె బెడ్ పై కూర్చుని కవ్విస్తూ చూస్తున్న తీరు యువకులకు నయనానందం కలిగిస్తోంది. దీంతో ఈ హాట్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. ఇక జాక్వెలిన్ కిట్టీలో ప్రస్తుతం పలు బాలీవుడ్ భారీ చిత్రాలున్నాయి. అందులో ‘భూత్ పోలీస్’ అనే హారర్ థ్రిల్లర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్ కిర్పాలానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, యామి గౌతమ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

Exit mobile version