Site icon NTV Telugu

Jacqueline Fernandez: ఖరీదైన బహుమతులు, లగ్జరీ లైఫ్‌.. జాక్వెలిన్‌కు సుప్రీం షాక్

Jacqueline

Jacqueline

మనీ లాండరింగ్‌ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు సుప్రీం కోర్ట్ నుండి భారీ షాక్ తగిలింది. ఆమెపై ఉన్న రూ.215 కోట్ల ఈడీ కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ కేసు విచారణ కొనసాగనుంది. ఈ కేసు వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే.. రూ.200 కోట్ల దోపిడీ కేసు. ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఇందులో ప్రధాన నిందితుడు. ఈ డబ్బు నుంచి జాక్వెలిన్‌ లబ్ధి పొందినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సుకేశ్‌ దోపిడీదారుడని తెలిసినా, ఆయనతో సంబంధాలు కొనసాగించారని అధికారులు పేర్కొన్నారు.

Also Read : Maa Vande: ‘మా వందే’ నుండి మోదీ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

సుకేశ్‌ నుంచి జాక్వెలిన్‌ అనేక విలాసవంతమైన కానుకలు స్వీకరించినట్లు దర్యాప్తులో బయటపడింది. అందులో డిజైనర్‌ బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌ కారు వంటి బహుమతులు ఉన్నాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.10 కోట్లకు పైగా ఉంటుందని ఈడీ అంచనా వేసింది. అంతేకాకుండా, ఈ బహుమతులు జాక్వెలిన్‌ కుటుంబ సభ్యులకు కూడా అందించబడినట్లు గుర్తించారు. జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు, లగ్జరీ లైఫ్‌ను ఆస్వాదించిన నేపథ్యంలో ఆమెపై విమర్శలు పెరిగాయి. ఈడీ సాక్ష్యాధారాలతో కోర్టులో బలంగా వాదిస్తోంది. ఇక సుప్రీంకోర్ట్ పిటిషన్‌ తిరస్కరించడంతో, జాక్వెలిన్‌ లీగల్‌ పోరాటం మరింత కఠినంగా మారింది.

సినిమాలతో బిజీగా ఉండాల్సిన ఈ సమయంలో జాక్వెలిన్‌ నిరంతరం కేసుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆమె భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగా మారింది. ఈ కేసు తుది ఫలితం ఆమె కెరీర్‌ మీద ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

Exit mobile version