Jabardasth hari: కారణం ఏదైనా కావొచ్చు.. ఒక్కోసారి మనం చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. జబర్దస్త్ కమెడియన్ హరిత అలియాస్ హరికృష్ణ ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. రెండు రోజుల క్రితం హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నెక్కుండి గ్రామ శివారులో స్కార్పియో, వేగనార్ కార్లలో ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులను చూసి దుండగులు రెండు వాహనాలతో పరారయ్యేందుకు ప్రయత్నించగా ఓ డ్రైవర్ వాహనంతో పాటు పరారయ్యాడు. మరో డ్రైవర్ తిరుపతి కిషోర్ పట్టుబడ్డాడు. అతని నుండి సమాచారం అందుకున్న పోలీసులు జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పోలీసులు హరి పేరును మీడియాకు వెల్లడించారు. కాణిపాకం పోలీస్ స్టేషన్‌లో అతని పేరు నమోదైంది. దాదాపు రూ. 60 లక్షల సరుకును తరలించే ప్లాన్ కూడా అతిడిదే అని తెలిపారు. ప్రస్తుతం హరి పరారీలో ఉన్నట్లు తెలిసింది. కానీ హరిబాబుపై కేసు నమోదైంది. అతను గతంలో షకలక శంకర్ టీమ్‌లో పనిచేశాడు. హరి అని పోలీసులు చెప్పడంతో.. ప్రస్తుతం జబర్దస్త్‌లో కమెడియన్‌గా నటిస్తున్న హరికృష్ణ అని మీడియాలో పుకార్లు వచ్చాయి. హరికృష్ణ ఫోటోలు పోస్ట్ చేసి మరీ వార్తలు రాశారు.
Read also: Sai Dharam Tej: ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ ప్రేమాయణం?
ఇక తాజాగా తనపై వస్తున్న వార్తలను హరికృష్ణ ఖండించారు. కేసు నమోదు చేసింది తనపై కాదని, గతంలో ఇదే జబర్దస్త్ షోలో పనిచేసిన హరికృష్ణపైనేనని ఫిర్యాదు చేశారు. నేను స్మగ్లర్ హరిబాబుని కాను అని జబర్దస్త్ హరికృష్ణ వివరణ ఇచ్చారు. 2013లో షకలక శంకర్ టీమ్ లో హరిబాబు అనే వ్యక్తి ఒకటి రెండు మూడు ఎపిసోడ్ లలో వచ్చాడని జబర్దస్త్ హరి అన్నారు. మీడియాలో తనపై ఇలాంటి వార్తలు రావడంతో తాను, తన కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ స్మగ్లింగ్ పై తన స్నేహితులు, అభిమానులు ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదని జబర్దస్త్ హరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో తనకు ఇలా జరగడం ఇది మొదటిసారి కాదని.. ఇది మూడోసారి అని హరి అన్నారు. నిజానిజాలు తెలుసుకున్న తర్వాత అసలు నిందితుల గురించి రాయాలని, ఫొటోలు పెట్టాలని అన్నారు. లాక్‌డౌన్‌కు ముందు తనపై ఇలాంటి వార్తలు రాసేవారని, ఇప్పుడు మూడోసారి తన ఫొటోలను దోషిగా చూపుతున్నారని ఆయన బాధపడ్డారు. నిజం తెలుసుకుని తనను వదిలేయాలని వేడుకున్నాడు.
Weather Forecast: నేడు తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. రేపు అక్కడక్కడ వడగాల్పులు