Site icon NTV Telugu

Jaat : తెలుగులోనూ ‘జాట్’.. ఎప్పుడంటే?

Jaath

Jaath

గదర్ 2 సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్ హీరోగా ‘జాట్’ అనే సినిమా రూపొందింది. తెలుగులో యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీ డియోల్ సరసన రెజీనా కసాండ్రా హీరోయిన్‌గా నటించింది. రణదీప్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.

Menstruation Period: నెలసరి ఆలస్యం కావడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి!

ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10వ తేదీన, అంటే రేపు, రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ముంబైలో ఒక గ్రాండ్ ప్రీమియర్ ప్లాన్ చేశారు. బాలీవుడ్ బడా హీరోలను ఈ ప్రీమియర్‌కి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ ఆడియన్స్‌ను మెచ్చే మాస్ కంటెంట్‌తో ఈ సినిమా ఉందని, ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్‌కి హిందీలో ఇది ఒక గేమ్ చేంజింగ్ అవుతుందని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి. వచ్చే వారం ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. హిందీ టాక్‌తో సంబంధం లేకుండా తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్ కావడం, నిర్మాణ సంస్థ తెలుగుదే కావడంతో పాటు, ఇతర నటీనటులు కూడా తెలుగువారికి బాగా తెలిసిన వారే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Exit mobile version