Site icon NTV Telugu

Jaan Say: కిరణ్ కుమార్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే’

John Say

John Say

Jaan Say: కొత్త తరహా కథాంశాలతో సినిమాలను రూపొందిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. వాటిని ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్. కృతి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘జాన్ సే’ పేరుతో కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో సినిమా తీస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఇందులో అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరు వరకు జరిగే షెడ్యుల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇందులో హీరోగా నటిస్తున్న అంకిత్ ఇంతకముందు ‘జోహార్, తిమ్మరుసు’ వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి ‘ఐరావతం’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. భారీ బడ్జెట్ తో సీనియర్ నటీనటులతో లావిష్ గా తెరకెక్కిస్తున్నామని, ఈ చిత్రానికి సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారని, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తామంటున్నారు దర్శకనిర్మాతలు.

Exit mobile version