Site icon NTV Telugu

Ivana : హైట్ కాదు హిట్ కావాలి.. ఎవరైనా నేను రెడీ

Ivana

Ivana

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ యువతలో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఇవానా. ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి చిత్రంతోనే తన పాత్రలోని హావభావాలు, ఫ్రెష్ ఎనర్జీతో బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ‘సింగిల్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ, కేతిక కంటే ఎక్కువగా రెస్పాన్స్ అందుకుంది. అయితే టాలీవుడ్‌లో ప్రజంట్ స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశాలు రావడానికి, వయసు పెద్ద అడ్డంకి కాదు. ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న యంగ్ హీరోలతో నటించేందుకు ఆమె పర్‌ఫెక్ట్. కానీ హైట్ విషయంలో చూసుకుంటే ఆమె ఎత్తు 5 అడుగులు మాత్రమే అయినా, కెమెరా యాంగిల్స్ ద్వారా ఆ లోపాన్ని కవర్ చేయవచ్చు. అయితే ఇదే విషయం మీద తాజాగా ఇవానా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

Also Read : Maargan : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజయ్ ఆంటోనీ ‘మార్గన్’

‘నటికి హైట్ పెద్ద అడ్డంకి కాదు. రష్మికా మందన్నా కూడా చాలా పొట్టి అయినప్పటికీ నేషనల్ క్రష్‌గా మారింది. ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్‌తో దూసుకెళ్తోంది’ అని ఉదాహరణ కూడా ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాల కోసం పూర్తిగా ఫోకస్ పెట్టిన ఇవానా, ట్రెండింగ్ యంగ్ డైరెక్టర్స్‌తో కమిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ కొత్త సినిమా అవకాశాన్ని దక్కించుకుందని టాక్. ఇక మిగతా నిర్మాతలు, దర్శకులు ఈ యువనటి టాలెంట్‌ను ఎప్పటికైనా గుర్తించి, మంచి అవకాశాలు ఇస్తారో చూడాల్సిందే!

Exit mobile version