‘టక్ జగదీష్’ తన స్టైల్ ఆఫ్ టక్ తో థియేటర్ల దుమ్ము దులపటానికి సిద్దమవుతున్నాడు. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘నిన్నుకోరి’ లాంటి సినిమాతో హిట్ కొట్టారు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తిచేసుకొని ఉండగా.. ఏప్రిల్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా థియేటర్లు పునప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీ కానున్నారు. వీలైనంతా త్వరగా విడుదల తేదీని ప్రకటించి, ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. థియేటర్లు ఓపెన్ కాగానే విడుదలయ్యే సినిమాల్లో ఈ సినిమా ముందు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.