Site icon NTV Telugu

Milk Beauty : మిల్కి బ్యూటీకి ఆఫర్లు తెచ్చిపెడుతోన్న ఐటమ్ సాంగ్స్

Tamanna

Tamanna

ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ పీక్స్‌లో ఉండగా ఐటమ్ సాంగ్ చేస్తే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. ఎందుకంటే ఒక సారి ఐటమ్ గర్ల్స్‌గా మారాక ఫీమేల్ లీడ్స్ కన్నా అలాంటి ఆఫర్లే వచ్చేవి కాబట్టి. అది వన్స్ ఆపాన్ ఎ టైం ముచ్చట. ఇలాంటి పోకడలకు బ్రేకులేసింది తమన్నా. ఐటమ్ నంబర్స్ చేస్తూనే హీరోయిన్‌గానూ ఆఫర్లను కొల్లగొట్టొచ్చని ఫ్రూవ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ చేయనన్నీ పెప్ సాంగ్స్ చేసి స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్సైంది తమ్ము. ఇంచు మించు టెన్ పెప్ సాంగ్స్‌లో నర్తించింది అమ్మడు.

Also Read : ilaiyaraaja : ఇళయరాజా కారణంగా నెట్ ఫ్లిక్స్ నుండి స్టార్ హీరో సినిమా డిలీట్

స్పెషల్ సాంగ్స్‌తో సిల్వర్ స్క్రీన్‌ను సిజ్లీంగ్ చేస్తోన్న మిల్కీ బ్యూటీ. ఫస్ట్ టైం డిజిటల్ స్క్రీన్‌పై గ్లామర్ ట్రీట్‌తో హీట్ పుట్టించేందుకు రెడీ అయ్యింది. కొడుకు ఆర్యన్ ఖాన్‌ను దర్శకుడిగా నిలబెట్టేందుకు ఫాదర్ షారూఖ్ ఖాన్ చేస్తున్న ప్రయత్నాల్లో తమన్నా ఓ భాగమైంది. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ కోసం ఇప్పటికే స్టార్టను దింపేసిన కింగ్ ఖాన్ ఇప్పుడు గ్గామర్ డోస్ అద్దుతున్నాడు. తమ్ముతో ఓ స్పెషల్ సాంగ్ చేయించాడు. సెప్టెంబర్ 18 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌లో మరింత బోల్డ్‌గా కనిపించబోతుంది మిల్కీ బ్యూటీ.  ఓ వైపు సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు వస్తే వదులుకోవడం లేదు తమన్నా. ఓ సినిమాను ఆరు నెలల నుండి ఏడాదికి పైగా వెచ్చిస్తే రూ.  4 నుండి రూ. 5 కోట్లు అందుకుంటుంటే ఫ్యూ డేస్‌లో కంప్లీటయ్యే ఐటమ్ సాంగ్ కోసం కోటి నుండి రెండు కోట్ల వరకు చార్జ్ చేస్తోంది భాటియా. ఈ లెక్కన చూస్తే ఒక్క సినిమాతో వచ్చే రెమ్యునరేషన్ రెండు స్పెషల్ సాంగ్స్ చేస్తే వచ్చేస్తున్నాయి. అందుకే మేడమ్ కూడా వీటిపై ఫోకస్ చేస్తుంది. వరుసగా పెప్ సాంగ్స్ చేస్తుంటే.. కెరీర్ డ్యామేజ్ అవ్వొచ్చేమో కానీ.. తమన్నాకు ప్లస్సే అయ్యింది. స్త్రీ2, రైడ్2లో స్పెషల్ సాంగ్స్ తర్వాత బీటౌన్ లో ఆఫర్లు కొల్లగొడుతూనే ఉంది. ప్రజెంట్ ఆమె చేతిలో రొమియో, రేంజర్, వివాన్‌తో పాటు మరో ప్రాజెక్ట్ ఉంది. ఈ లెక్కన చూస్తే తమ్మూకి ప్లస్ అయినట్లే కదా.

Exit mobile version