Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”

Isakapatnam

Isakapatnam

ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మోస్ట్ అవేటెడ్ తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసకపట్నం’ అఫీషియల్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా అండ్ రస్టిక్ పొలిటికల్ గ్యాంగ్ వార్ డ్రామా ఇది. రక్తాన్ని ఉడికించే యాక్షన్, మైండ్ గేమ్‌లు, కుటుంబ విభేదాల కలబోతగా వస్తోన్న ఈ సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఈ సిరీస్‌లో వెర్సటైల్ నటుడు సముద్రఖని ‘నాయుడు’ అనే అత్యంత పవర్‌ఫుల్ రోల్‌లో నటించగా.. టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఆయన కూతురు ‘భారతి’ పాత్రలో నటించారు. ఇసకపట్నం అనే పోర్ట్ టౌన్‌లో రాజకీయాలు, అండర్ వరల్డ్ నేరాలు, వందల కోట్ల వ్యాపారాలపై ఏకఛత్రాధిపత్యం చెలాయించే నాయుడికి.. చివరకు తన సొంత కూతురే ఒక పెద్ద సింహస్వప్నంగా మారుతుంది.

తన జీవితాన్ని, తన ఊరిని తండ్రి గుప్పిట్లోంచి కాపాడుకోవడానికి, తండ్రి అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి భారతి తిరుగుబాటు చేయడమే ఈ సిరీస్ మేజర్ హైలైట్. ట్రైలర్‌లో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే డైలాగ్స్, మైండ్ గేమ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ గ్యారీ బీహెచ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లతో రాబోతోంది. ప్రశాంత్ రాఘతి అందించిన అద్భుతమైన కథకు, తాజుద్దీన్ సయ్యద్ రాసిన పవర్‌ఫుల్ సంభాషణలు తోడయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘తమడా మీడియా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సిరీస్‌లో కమెడియన్ సునీల్ సరికొత్త రోల్‌లో కనిపించబోతుండగా.. నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో మెరవనున్నారు.

ట్రైలర్‌తోనే సిరీస్‌పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిన ‘ఇసకపట్నం’.. వచ్చే వారం జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఆడియో అందుబాటులో ఉండనుంది. అంతేకాదు, ఏకంగా 15 భాషల సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాల్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఒకేసారి రిలీజ్ చేయనుంది.