టాలీవుడ్ స్టార్ బ్యూటీని అనుష్క శెట్టిని ఫ్యాన్స్ గట్టిగానే మిస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో హడావుడి లేకపోయినా ఆఫ్ స్క్రీన్ కనిపించకపోయినా ఆన్ స్క్రీన్‌లో చూసుకుని ఆనందపడిపోతున్నారు. ప్రమోషన్స్ స్కిప్ చేసినా ఫీల్ కావట్లేదు. స్వీటీని తెరపై చూస్తే అదే చాల్లే అని ఫిక్స్ అయిపోయారు. అయినా బొమ్మాళి దయ తలచట్లేదు. ఏడాదికి ఓ సినిమా తీసుకు రావడానికి కష్టపడుతోంది అనుష్క.
ఘాటీ వచ్చి ఏడాదౌతున్నా కొత్త సినిమా ఎనౌన్స్ చేయలేదు అనుష్క. ఇక స్వీటీ చేతిలో ఉన్న ఏకైక ఫిల్మ్ కథనార్. ఈ మూవీ ఇప్పుడు కమిటైంది కాదు.. మూడేళ్ల క్రితం సైన్ చేసిన ఫిల్మ్. మాలీవుడ్ స్టార్ హీరో జయసూర్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో నీలాగా కనిపించబోతుంది అనుష్క. ఐదు నెలల క్రితమే ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ ఏ స్థాయిలో ఉండబోతుందో రివీల్ చేశారు. కథనార్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో రిలీజ్ చేస్తోంది నిర్మాణ సంస్థ శ్రీ గోకులం. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పడం లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామన్నాడు ఫిల్మ్ మేకర్. దసరా లేదా ఇయర్ ఎండింగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని మాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం అనుష్క చేతిలో ఈ మూవీ తప్ప మరో సినిమా లేదు. తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. అందుకే కథనార్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. చూడాలి డార్లింగ్ వచ్చే మంత్‌లో అనుష్క వస్తుందో..? మరో ఫెస్టివల్ చూసుకుంటుందో..? టాలీవుడ్ సినిమాలకు ప్రమోషన్స్ స్కిప్ చేసిన స్వీటీ, మాలీవుడ్ పాన్ ఇండియా మూవీ కోసం బయటకొస్తుందేమో లెట్స్ వెయిట్.

