Anirudh: తెలుగు సినిమాలకు అనిరుద్ గండం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కీలక పాత్ర వహిస్తుంది. ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడానికి సాంగ్స్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఇక సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు సైతం ఎలివేట్ అవ్వడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే సక్సెస్ లను సాధించాయి. దీన్నిబట్టి చూస్తే సినిమా విజయంలో మ్యూజిక్ పాత్ర ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… అందుకే మన స్టార్ డైరెక్టర్లు తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ ను తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజానికి అనిరుద్ కి తెలుగులో సక్సెస్ రేట్ చాలా తక్కువ… ఆయన తెలుగులో మ్యూజిక్ అందించిన సినిమాలేవీ కూడా బ్లాక్ బస్టర్లుగా నిలవలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ‘అజ్ఞాతవాసి’ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు, అది డిజాస్టర్ అయింది. అలాగే విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ‘జర్సీ’ మూవీ సక్సెస్ అయినా, దానికి భారీ కలెక్షన్స్ రాలేదు. అయినప్పటికీ మనవాళ్ళు ఆయన జపమే చేస్తున్నారు. అనిరుద్ తమిళ్ సినిమాల మీద పెట్టిన ఇంట్రెస్ట్ తెలుగు సినిమాల మీద పెట్టడం లేదు.
దసరా సక్సెస్ తో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘ప్యారడైజ్’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా కోసం శ్రీకాంత్ అనిరుద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. నిజానికి ఈ సినిమా ఒక్క గ్లింప్స్ తో భారీ బజ్ ను క్రియేట్ చేసుకుంది. అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ వల్లే ఆ గ్లింప్స్ కి అంత హైప్ వచ్చింది. గ్లింప్స్ తో అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లిన అనిరుద్, సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం అంత ఎఫర్ట్స్ పెట్టలేదనే చెప్పాలి. సినిమాలోని కొన్ని సన్నివేశాలను మినహాయిస్తే, సెకండాఫ్ మొత్తం అసలు ఎక్కడా కూడా అనిరుద్ తన మార్క్ మ్యూజిక్ ను అందించలేకపోయాడు. దాంతో సినిమా ప్రేక్షకులకు పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది.
నిజానికి సినిమా ఫెయిల్యూర్ లో దర్శకుడి మిస్టేక్ కూడా ఉంది. కానీ జైలర్ లాంటి యావరేజ్ సినిమాను తన నేపథ్య సంగీతంతో బ్లాక్ బస్టర్ గా మలిచిన అనిరుద్, ఈ సినిమా విషయంలో మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. డిసి మూవీకి సైతం అనిరుద్ మంచి మ్యూజిక్ ను అందించాడు. అందుకే ఆ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ‘ప్యారడైజ్’ కి పూర్తి స్థాయిలో వర్క్ చేయలేకపోయాడు… ఇప్పటికైనా మన దర్శకులు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తే, వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కష్టపడి చాలా చక్కటి మ్యూజిక్ ను అందించగలరని మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం.
Also Read
- Tollywood: ఈ స్టార్ హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీస్ పడితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్?
- Dimple Hayathi: నా పెళ్లి ఎప్పుడైంది బాబూ? నెటిజన్ కామెంట్‌కు డింపుల్ హయాతి క్రేజీ రిప్లై!
- Sakkshi Mhadolkar: డైలాగులు లేవని ఫ్రెండ్స్ ఏడిపించేవారు.. ‘ఫ్యామిలీ ప్యాక్’తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తా!
- Balakrishna: బాలయ్య ఆ దర్శకుడికి 'నో' చెప్పాడా?
తాజావార్తలు
-
Anirudh: తెలుగు సినిమాలకు అనిరుద్ గండం?
-
UP Elections: రాయ్‌బరేలీలో సున్నా.. అమేథీలో ఒక్కటే! కాంగ్రెస్‌కు ఎస్పీ షాక్
-
Local Body Elections: స్థానిక ఎన్నికల వేళ వైసీపీ బిగ్ వార్నింగ్.. కలెక్టర్లు, ఎస్పీల వరకు అందరికీ లీగల్ నోటీసులు!
-
Tollywood: ఈ స్టార్ హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీస్ పడితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్?
-
Tamil Nadu: కార్తీక దీపం వేళ తమిళనాడులో హైటెన్షన్.. తిరుప్పరకుండ్రంలో ఆంక్షలు, బీజేపీ నేతల అరెస్ట్!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!