IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

Irumudi

Irumudi

మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ఇరుముడిఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులు మరియు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రవితేజను  ఒక సరికొత్త, వైవిధ్యమైన పవర్ ఫుల్ అవతార్‌లో దర్శకుడు ప్రజెంట్ చేయబోతున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో రవితేజకు సంబంధించిన ‘అయ్యప్ప మాల’ ధరించిన లుక్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ లుక్ సినిమాపై ఒక్కసారిగా హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ వీడియో గ్లిమ్స్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్లిమ్స్ సినిమా రేంజ్‌ను చూపేలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మోస్ట్ అవేటెడ్ గ్లిమ్స్ ను ఈనెల 3వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. ఈ గ్లిమ్స్‌తో పాటే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గ్లిమ్స్‌లో మాస్ మహారాజా లుక్ మాత్రం సెన్సేషనల్ గా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. చిత్ర యూనిట్ ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా సరైన మాస్ హిట్ లేక సతమతమవుతున్న రవితేజ ఇటీవల ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో తన రూట్ మార్చారు. ఈ నేపథ్యంలో భక్తి, యాక్షన్ కలగలిపిన ఒక డిఫరెంట్ కథాంశంతో వస్తున్న ‘ఇరుముడి’ చిత్రంతో మాస్ రాజా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం గ్యారెంటీ అని అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

×
×
Ad