Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi Break: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. కేవలం ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసి సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రవితేజ ఖాతాలో మరో భారీ కమర్షియల్ సక్సెస్ చేరినట్లైంది. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ అద్భుతమైన ఓపెనింగ్స్ అందించిందని చెబుతున్నారు. బలమైన కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీలు క్రమంగా పెరుగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజే ఎక్కువ కలెక్షన్లు నమోదు కావడంతో.. ఈ సినిమా మిడ్ రేంజ్ చిత్రాల్లో ఆల్‌టైమ్ రికార్డుల దిశగా దూసుకెళ్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఇరుముడి’ బాక్సాఫీస్ జోరు బుక్‌మైషో టికెట్ సేల్స్‌లోనూ స్పష్టంగా కనిపించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్ అయిన తొలిరోజు గంటకు సుమారు 32 వేల టికెట్ల అమ్మకాలతో ఈ చిత్రం రికార్డు క్రియేట్ చేసిందని వెల్లడించారు. అయితే ఆ రికార్డు ఎక్కువసేపు నిలవలేదని, రెండో రోజే గంటకు 36 వేల టికెట్ల పీక్ సేల్స్‌తో తన రికార్డును తానే ఇరుముడి సినిమా అధిగమించిందన్నారు. థియేటర్లలో పెరుగుతున్న ఆక్యుపెన్సీలు, టికెట్ సేల్స్ చూస్తుంటే ఈ సినిమా లాంగ్ రన్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
‘ఇరుముడి’ సక్సెస్‌తో పాటు ఈ సినిమాకు రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ నిర్ణయం కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం ఆయన సుమారు రూ.7 కోట్లు మాత్రమే అడ్వాన్స్‌గా తీసుకున్నారని సమాచారం. మిగిలిన మొత్తాన్ని లాభాల్లో వాటా రూపంలో, ముఖ్యంగా నైజాం ఏరియా రైట్స్ ద్వారా పొందేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా సక్సెస్ కావడంతో ఈ నిర్ణయం రవితేజకు భారీగా కలిసొచ్చిందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నిర్మాతలపై బడ్జెట్ భారం తగ్గడంతో పాటు.. సినిమా సక్సెస్ అయితే హీరోకు లాభాల్లో గణనీయమైన వాటా దక్కేలా ఈ మోడల్ పనిచేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇరుముడి’ నైజాం ఏరియాలోనూ బలమైన వసూళ్లు సాధిస్తోంది. తొలిరోజే దాదాపు రూ.4.3 కోట్ల నికర షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇదే జోరు కొనసాగితే లాంగ్ రన్లో నైజాం నుంచి సుమారు రూ.20 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిర్మాత దిల్ రాజు కూడా బాలీవుడ్లో అమలవుతున్న రెవెన్యూ షేరింగ్ మోడల్ గురించి ప్రస్తావించారు. హీరోలు భారీ రెమ్యునరేషన్‌కు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటే నిర్మాతలపై భారం తగ్గుతుందని, సినిమా విజయవంతమైతే నటులకు భారీ ప్రయోజనం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే తరహా మోడల్‌ను రవితేజ ‘ఇరుముడి’ కోసం అనుసరించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల చెన్నైలో జరిగిన ‘ఇరుముడి’ గ్రాండ్ ప్రెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతో ప్రేమిస్తారని, థియేటర్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కథను తమ గుండెల్లో మోసుకెళ్తారని భావోద్వేగంగా చెప్పారు. ప్రస్తుతం ప్రేక్షకుల స్పందన చూస్తుంటే రవితేజ నమ్మకం నిజమవుతున్నట్లే కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, బలమైన కథతో ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండటంతో.. ఈ సినిమా రవితేజ కెరీర్లోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
- Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
- Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
- NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
తాజావార్తలు
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!