Parastoo Ahmadi : హిజాబ్ ధరించలేదని గాయనిపై అరాచకం.. ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల స్వేచ్ఛపై ఇరాన్ ప్రభుత్వం మరోసారి తన ఉక్కుపాదాన్ని మోపింది. అక్కడి కఠినమైన సాంప్రదాయ చట్టాలను ఉల్లంఘించిందనే నెపంతో ఒక అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఓ సింగర్ మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించలేదన్న ఒకే ఒక్క కారణంతో ఇరాన్‌కు చెందిన ప్రముఖ పాప్ గాయని, సంగీత దర్శకురాలు పరాస్తూ అహ్మదీ (29)కి అక్కడి న్యాయస్థానం అత్యంత ఘోరమైన శిక్షను ఖరారు చేసింది.
నిబంధనల ప్రకారం ఇరాన్లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు కచ్చితంగా హిజాబ్ ధరించడం అత్యంత తప్పనిసరి. అయితే, 2024 లో జరిగిన ఒక ప్రముఖ సంగీత ప్రదర్శనలో పరాస్తూ అహ్మదీ హిజాబ్ లేకుండా, స్లీవ్‌లెస్ దుస్తులతో స్టేజ్ ఎక్కి పాటలు పాడారు. స్లీవ్‌లెస్ దుస్తులతో ప్రేక్షకులను అలరించినందుకు గానూ.. ఇరాన్ ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఆమెకు ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్షను విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కొరడా దెబ్బల శిక్షతోనే ఈ వేధింపులు ఆగలేదు. పరాస్తూ అహ్మదీ రాబోయే రెండేళ్ల పాటు ఎలాంటి కన్సర్ట్స్ ఇవ్వకూడదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ఆమె దేశం విడిచి ఎక్కడికీ వెళ్లకుండా రెండేళ్ల పాటు ట్రావెల్ బాన్ కూడా విధించారు. గతంలోనూ హిజాబ్ సరిగ్గా ధరించలేదని మహ్సా అమీని అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె లాకప్‌లోనే మరణించడం అప్పట్లో ఇరాన్‌ను కుదిపేసింది. ఇప్పుడు మరోసారి గాయని పరాస్తూ అహ్మదీపై జరిగిన ఈ దారుణం ఇరాన్ మహిళల్లో సరికొత్త ఆగ్రహానికి కారణమవుతోంది.
Also Read
తాజావార్తలు
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
-
Rega Kantha Rao: “కేసు కొట్టేయండి”.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!