Site icon NTV Telugu

ఆకాష్ పూరీ బర్త్ డే సందర్భంగా ‘చోర్ బజార్’ ఫస్ట్ లుక్

Introducing Bachan Saab from Chor Bazaar

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. హీరోయిన్ గా గెహన సిప్పీ నటిస్తోంది. ‘దళం, జార్జ్ రెడ్డి’ సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఐ. వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘చోర్ బజార్’ చిత్రంలో ఆకాష్ పూరి, గెహన సిప్పీ లతో పాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.

Read Also : రెయిన్ సాంగ్ కు నో అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

ఈ రోజు హీరో ఆకాష్ పూరి బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ మాస్ గా ఉంది. హీరో ఆకాష్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. బైక్ పక్కన నిలబడి ఉన్నాడు. చేతిమీద ‘బచ్చన్ సాబ్’ పేరుతో టాటు కనిపిస్తుంది. మరో చేత్తో గన్ ఫైరింగ్ చేస్తున్నాడు. చోర్ బజార్ లో ఉండే సామను అంతా ఈ మోషన్ పోస్టర్ లో కనిపిస్తుంది. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ ఫెక్ట్ గా సూట్ అయింది. ‘ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్ లో శరవేగంగా జరుగుతోంద’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Exit mobile version